
ఓటీటీ

తెలంగాణకు రావడానికి, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్ కల్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగానే తెలంగాణ మంత్రులు పవన్ కల్యాణ్‌పై స్పందించారని తెలిపారు. తెలంగాణలో పవన్ రాజకీయ కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ సమావేశానికి అనుమతి నిరాకరించడానికి కారణం కేవలం శాంతిభద్రతల అంశమేనని సీఎం వివరించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదో పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!