

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు మెటా ప్లాట్ఫార్మ్స్ భారీ పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించగా, మరో 7,000 మంది ఉద్యోగులను ఏఐ ఆధారిత ప్రాజెక్టులు, సాంకేతిక విభాగాలకు బదిలీ చేసింది. భవిష్యత్తులో ఏఐ ఆధారిత కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.
అయితే ఈ మార్పుల ప్రక్రియలో కొన్ని పొరపాట్లు జరిగాయని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ అంగీకరించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఉద్యోగులకు పంపిన అంతర్గత సందేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఈ ఏడాదిలో ఇకపై ఉద్యోగుల తొలగింపులు ఉండవని భరోసా ఇచ్చిన జుకర్బర్గ్, సాంకేతిక మార్పుల నేపథ్యంలో సవాళ్లు సహజమని పేర్కొన్నారు. ఉద్యోగులు నిర్వహించే కొన్ని పనులను ఏఐ ఏజెంట్ల ద్వారా నిర్వహించే అవకాశాలను కూడా మెటా పరిశీలిస్తోంది. టెక్ రంగంలో ఉద్యోగాల స్వరూపాన్ని ఈ మార్పులు ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!