
టెక్నాలజీ

భారత వాచ్ తయారీ సంస్థ టైటాన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. తన కొత్త జీరో అవర్ 500 మీటర్ ప్రొఫెషనల్ డైవర్ వాచ్ ఆవిష్కరణ కోసం ఇప్పటివరకు జరిగిన అత్యంత లోతైన నీటిలో ప్రొడక్ట్ ఫోటోషూట్‌ను విజయవంతంగా నిర్వహించింది. థాయిలాండ్‌లోని ఫుకెట్ సమీపంలో ఐదుగురు నిపుణులైన డైవర్లు సముద్ర మట్టానికి 52.1 మీటర్ల లోతులో ఈ షూట్ నిర్వహించారు. కేవలం 20 నిమిషాల సమయంలోనే ఫోటోలు తీసే అవకాశం వారికి లభించింది.
ల్యాబ్‌లో కాకుండా నిజమైన సముద్ర పరిస్థితుల్లో పరీక్షించడం ద్వారా తమ వాచ్ బలం, విశ్వసనీయతను నిరూపించుకోవాలని టైటాన్ లక్ష్యంగా పెట్టుకుంది. తీవ్రమైన నీటి పీడనాన్ని తట్టుకోగల సామర్థ్యం తమ కొత్త స్పోర్ట్స్ వాచ్‌కు ఉందని, ప్రపంచంలోని అత్యుత్తమ డైవింగ్ వాచ్‌లతో పోటీపడగలదని సంస్థ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!