
క్రీడలు

ఉత్తరప్రదేశ్లో విడుదలైన తాజా పంచాయతీ ఓటర్ల జాబితాలో కేంద్ర మాజీ మంత్రి, అమేథీ మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పేరు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకురాలి పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడంతో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఈ విషయంపై స్పందించిన అమేథీ జిల్లా మేజిస్ట్రేట్ సంజయ్ చౌహాన్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాతే పేరు గల్లంతవడానికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!