

మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క హైదరాబాద్ జిల్లా గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని మల్లేపల్లి సెంటర్, మహాత్మా గాంధీ నగర్ అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమంలో పాల్గొన్నారు. నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్‌తో కలిసి చిన్నారుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె, ప్రీ-స్కూల్ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేసి, ప్రాథమిక పాఠశాలల్లో చేరనున్న చిన్నారులకు విద్యారంభ ధృవపత్రాలు అందజేశారు. చిన్నారులతో కలిసి అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని, వారి అభ్యాస పురోగతి, పోషకాహార సేవలు, బోధన సామగ్రి వినియోగాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు కేవలం పోషకాహార కేంద్రాలు కాకుండా చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మంది చిన్నారులు అంగన్వాడీల్లో నమోదు అయ్యారని, వారికి నాణ్యమైన విద్య, పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించిన ఆమె, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను అంగన్వాడీల్లో చేర్పించి ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!