

‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు ఇప్పుడు భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒక హాలీవుడ్ సినిమా స్క్రిప్ట్ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉందని, మరో సిరీస్ అభివృద్ధిలో ఉందని తెలిపారు. అలాగే తాము రూపొందిస్తున్న హిందీ సినిమా త్వరలో నిర్మాణ దశలోకి వెళ్లనుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి కానీ దీనిపై అధికారిక స్పష్టత ఇంకా రాలేదు. గతంలో కూడా ఈ ప్రాజెక్ట్‌లో సమంత హీరోయిన్‌గా నటించవచ్చని ప్రచారం జరిగినా, దాన్ని ఆమె సన్నిహిత వర్గాలు ఖండించాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘SVC63’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!