
ఓటీటీ

జూన్ 21న నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామ్కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పలు కీలక మార్పులను ప్రకటించింది. పరీక్ష సమయాన్ని అదనంగా 15 నిమిషాలు పెంచుతూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని మరింత సమర్థంగా పూర్తి చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక ప్రశ్నపత్రంలో రఫ్ వర్క్ కోసం ఇచ్చే పేజీల సంఖ్యను నాలుగుకు పెంచారు. అలాగే ఎడమ చేతివాటం ఉన్న విద్యార్థులకు అనుకూలంగా బుక్లెట్ డిజైన్లో మార్పులు చేశారు. జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ను పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్టీఏ అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!