

అమెరికాకు చెందిన స్పేస్ఎక్స్ మాజీ ఉద్యోగి జువాన్ హెర్నాండెజ్ కథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2015లో గంటకు 28 డాలర్ల వేతనంతో వెల్డర్‌గా స్పేస్ఎక్స్లో చేరిన ఆయనకు కంపెనీ ఉద్యోగ ప్రయోజనంగా సుమారు 10,000 డాలర్ల విలువైన షేర్లు లభించాయి. ఆ సమయంలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ఆ షేర్లు, సంస్థ విలువ పెరుగుతూ రావడంతో ఇప్పుడు దాదాపు 1.1 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో జువాన్ కోటీశ్వరుడిగా మారాడు.
స్పేస్ఎక్స్ అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలు, పెట్టుబడిదారుల విశ్వాసం, మార్కెట్లో సంస్థకు పెరిగిన విలువ ఉద్యోగులకు భారీ లాభాలను అందించాయి. జువాన్ ఒక్కరే కాకుండా వేలాది మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులు కూడా షేర్ హోల్డింగ్‌ల ద్వారా మిలియనీర్లుగా మారినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే సంపద పెరిగినా తాను కష్టపడి పనిచేయడాన్ని కొనసాగిస్తానని జువాన్ చెప్పడం విశేషం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!