
టెక్నాలజీ

ఏఐపై అధికంగా ఆధారపడటం వల్ల మనిషి విమర్శనాత్మక ఆలోచన, తర్క శక్తి, స్వతంత్ర నిర్ణయ సామర్థ్యం క్రమంగా తగ్గిపోవచ్చని పరిశోధకులు హెచ్చరించారు. ఎంఐటీ, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, కార్నెగీ మెలన్, కార్నెల్ సహా ప్రముఖ సంస్థలకు చెందిన 30 మందికి పైగా పరిశోధకులు ఈ అధ్యయనాన్ని రూపొందించారు. శాస్త్రీయ పురోగతి, పాలన, సంక్షోభ నిర్వహణ వంటి కీలక రంగాల్లో మనిషి సామర్థ్యం బలహీనపడే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు.
రచన, విశ్లేషణ, నిర్ణయాల్లో ఏఐపై ఎక్కువగా ఆధారపడితే ఆలోచనా శక్తి తగ్గిపోవచ్చని అధ్యయనం తెలిపింది. ఇప్పటికే ఏఐ ఉపయోగించే సాఫ్ట్వేర్ ఇంజినీర్లలో సమస్య పరిష్కార నైపుణ్యం తగ్గినట్లు గుర్తించారు. విద్యార్థులు కూడా ఏఐ సమాధానాలను నేరుగా కాపీ చేస్తున్నారని, దీని వల్ల నైపుణ్యాలు ఉన్నవారికి, ఆధారపడేవారికి మధ్య అంతరం పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!