

సినీ నటుడు మరియు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇటీవల తనపై వస్తున్న వ్యక్తిగత వివాదాలపై స్పందించారు. చెన్నై సమీపంలోని చెంగల్పట్టులో టీవీకే ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తన వ్యక్తిగత సమస్యల గురించి అభిమానులు లేదా పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. “ఇటీవల నాకు ఎదురవుతున్న సమస్యలు మీ సమయం కంటే విలువైనవి కావు. వాటిని నేను స్వయంగా చూసుకుంటాను. మీరు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి” అని విజయ్ తెలిపారు. కార్యక్రమంలో మహిళలకు ప్రత్యేక హామీలు ప్రకటిస్తూ పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు.
ఇక మరోవైపు విజయ్ భార్య సంగీత కోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల కేసు పూర్తయ్యే వరకు చెన్నైలోని విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. నీలంగరైలోని ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరితే విజయ్ తన లాయర్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భార్యాభర్తల బంధానికి విజయ్ ద్రోహం చేశారని పేర్కొంటూ ఫిబ్రవరి 24 న సంగీత విడాకుల కోసం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారణ వచ్చే నెల 20 న జరగనుండగా, ఆ రోజు కోర్టుకు హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు జారీ అయ్యాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!