
న్యూస్

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ప్రపంచ పాలన వ్యవస్థను బలోపేతం చేయాలని, అంతర్జాతీయ నియమాలను సముచితంగా అమలు చేయడానికి చైనా–రష్యా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) వంటి వేదికల్లో రెండు దేశాలు మరింత సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.
బీజింగ్‌లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‌తో సమావేశమైన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రపంచం అస్తవ్యస్త పరిస్థితుల వైపు వెళ్లకుండా బహుళపాక్షికతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చైనా–రష్యా వ్యూహాత్మక విశ్వాసంతో కలిసి పనిచేయాలని జిన్‌పింగ్ పునరుద్ఘాటించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!