

హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాకు సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలను కోర్టు ముందుంచే వరకు ఎలాంటి అక్రమ లేదా అనధికార నిర్మాణాల కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టం చేసింది. అయితే చెరువులు, నీటి వనరులు, నాలాలు, పార్కులు, ప్రజా రహదారుల పునరుద్ధరణ పనులు కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా, నోటీసు ఇవ్వకుండా భారీ నిర్మాణాలను కూల్చివేయడం పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా చర్యల్లో సరైన ప్రామాణిక విధానం పాటించలేదని, వందల కేసుల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు పేర్కొంది. ఐలాపూర్ భూముల విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించిన కోర్టు, భవిష్యత్తులో కూల్చివేతలు చేపట్టే ముందు స్పష్టమైన మార్గదర్శకాలు తప్పనిసరిగా ఉండాలని సూచించింది.
.jpg&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!