

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి స్థిరమైన రాజధాని అవసరమని స్పష్టం చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆశయాల ప్రతీకగా అమరావతిని పేర్కొంటూ, విభజన చట్టంలో సవరణల ద్వారా రాజధానికి స్పష్టత, స్థిరత్వం కల్పించాలని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భావోద్వేగ ప్రసంగాలు చేశారు.
తీర్మానం ఆమోదం పొందిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించగా, త్వరలోనే పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరిగే అవకాశముంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు నాయకులు అమరావతికి న్యాయ పరిరక్షణ అవసరాన్ని నొక్కిచెప్పారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సమావేశానికి గైర్హాజరవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో రాజధానిపై వివాదాలు రాకుండా ఈ తీర్మానం కీలక అడుగుగా భావిస్తున్నారు.




.png&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!