

దశాబ్దాలుగా పేదల సంక్షేమానికి కట్టుబడి సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్‌కు విదేశీ నిధుల విషయంలో ఏర్పడిన సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రధానినరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకున్న చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించడం గమనార్హమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది గ్రామాల్లో ఈ ట్రస్ట్ పేదలకు వివిధ సేవలు అందిస్తూ వస్తోందని ఆయన తెలిపారు. అయితే విదేశీ నిధుల నియంత్రణ చట్టం కింద గతంలో విధించిన పరిమితుల కారణంగా సంస్థ సేవలకు అంతరాయం ఏర్పడిందని వివరించారు. సంస్థ కార్యకలాపాల ప్రాముఖ్యతను కేంద్రానికి తెలియజేయడంతో సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైందని చెప్పారు.
కేంద్ర హోంమంత్రి ప్రత్యేక చొరవతో ట్రస్ట్‌కు మళ్లీ విదేశీ నిధులు స్వీకరించేందుకు అనుమతి లభించడం ద్వారా కార్యకలాపాలు తిరిగి వేగం అందుకుంటాయని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఈ ట్రస్ట్ సేవలపై ఆధారపడిన లక్షలాది మంది పేదలకు మళ్లీ ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి లబ్ధిదారుల తరఫున ఆయన సామాజిక మాధ్యమం ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
.avif&w=3840&q=75)






.jpeg&w=3840&q=75)

.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!