
రివ్యూస్

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద నిరసనకు దిగారు. అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై విచారణ కోసం హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మంత్రి కుటుంబంపై ఉన్న ఆరోపణలు బయటపెట్టే వరకు ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. మైనింగ్, భూముల వ్యవహారాలు, మెట్రో ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, కోట్ల రూపాయల ఆదాయం మాయం అవుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!