

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జర్నలిస్టులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వంలో మీడియాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రశ్నించే స్వేచ్ఛను కల్పించామని తెలిపారు. తమ ప్రభుత్వం జర్నలిస్టులకు అనుకూలంగా పనిచేస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
ప్రస్తుత కాలంలో జర్నలిజంలో విలువలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన సీఎం, మీడియా నైతిక ప్రమాణాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీలకు స్వంత మీడియా ఉండటం ప్రమాదకరమని పేర్కొన్నారు. గతంలో తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేశారని ఉదాహరణగా చెబుతూ, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాన్ని అరికట్టేందుకు జర్నలిస్టులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. నిజాయితీ, బాధ్యతతో మీడియా వ్యవహరించడం సమాజానికి ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!