
న్యూస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా “నో కింగ్స్” పేరుతో భారీ నిరసనలు చెలరేగాయి. నిర్వాహకుల ప్రకారం, ఇవి అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనల్లో ఒకటిగా నిలిచే అవకాశముంది. మిన్నెసోటా ఈ ఉద్యమానికి కేంద్రబిందువుగా మారింది. 50 రాష్ట్రాల్లో 3,100కి పైగా ప్రదేశాల్లో జరిగిన ఈ నిరసనల్లో 90 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నట్లు తెలిపారు. ‘‘లాభాల కోసం యుద్ధమా? మా సైనికులు అమ్మకానికి లేరు’’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు.
అయితే వైట్ హౌస్ ఈ నిరసనలను కొట్టిపారేసింది. ఇవి ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని పేర్కొంది. ఈ పరిణామాలు అమెరికాలో పెరుగుతున్న రాజకీయ విభేదాలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాయి.




.jpeg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!