

అమెరికాలో స్థానికులకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా హెచ్-1బీ వీసాదారులపై కీలక మార్పులకు అగ్రరాజ్యం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విదేశీ ఉద్యోగుల వేతనాలను పెంచే ప్రతిపాదనలు అమెరికా కార్మిక శాఖ తీసుకొచ్చింది. ఇవి అమల్లోకి వస్తే వార్షిక వేతనాలు సుమారు 14 వేల డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగులను తక్కువ వేతనంతో నియమించుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం అమెరికన్ ఉద్యోగులతో పోలిస్తే హెచ్-1బీ వీసాదారులు సగటున 10,191 డాలర్లు తక్కువ వేతనం పొందుతున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన వీసాల్లో 63 శాతం ఎంట్రీ లెవల్ ఉద్యోగులకే రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో నాలుగు స్థాయిల వేతన వ్యవస్థలో 34% నుంచి 88% వరకు పెంపులు ప్రతిపాదించారు. ఈ మార్పులు అమల్లోకి వస్తే కంపెనీలు ఏటా సుమారు 6.56 బిలియన్ డాలర్ల అదనపు వేతన భారం భరించాల్సి ఉంటుంది.












.jpg.webp&w=3840&q=75)




.jpeg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!