
సినిమాలు

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. అనంతరం వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఇద్దరూ బయలుదేరారు. సీఎంతో పాటు ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పర్యటనలో పాల్గొన్నారు.
వికారాబాద్‌లోని ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ పాల్గొననున్నారు. అనంతరం అనంతగిరి హరిత హోటల్లో డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో హాజరుకానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి రాహుల్ గాంధీ తిరుగు ప్రయాణం కానున్నారు.






.avif&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!