

దేశంలోని ప్రముఖ అందాల పోటీలలో ఒకటైన ఫెమినా మిస్ ఇండియా 2026 లో గోవాకు చెందిన సాధ్వి సతీష్ సైల్ విజేతగా నిలిచింది. ముంబైలో జరిగిన ఫైనల్ రౌండ్‌లో దేశం నలుమూలల నుంచి వచ్చిన పోటీదారులను అధిగమించి ఆమె ఈ గౌరవాన్ని దక్కించుకుంది. గత ఏడాది విజేత నికితా పోర్వాల్ ఆమెకు కిరీటం అందజేశారు. మహారాష్ట్రకు చెందిన రాజ్‌నందిని పవార్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.
సాధ్వి కేవలం అందంతోనే కాదు, తన ప్రతిభతో కూడా అందరిని ఆకట్టుకుంది. గోవాలో పెరిగిన ఆమెకు కర్ణాటకలోని కర్వార్‌తో కుటుంబ సంబంధాలు ఉన్నాయి. కొంకణి, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ సహా మొత్తం ఏడు భాషలు మాట్లాడగల సామర్థ్యం ఆమెకు ఉంది. మోడలింగ్‌లో రాణిస్తూ వ్యాపార రంగంలో కూడా తనదైన గుర్తింపు సంపాదిస్తోంది.
ఇంతకుముందు మిస్ టీన్ యూనివర్స్ ఇండియా వంటి టైటిళ్లను గెలుచుకున్న ఆమె, వచ్చే మిస్ వరల్డ్ 2027లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!