
సినిమాలు

ప్రముఖ గాయని ఆశా భోస్లే ముంబైలో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారన్న వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అనారోగ్య సమస్యల కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్చారని, అక్కడ చికిత్స పొందుతూ మరణించారన్న సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైద్యులు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆరోగ్యం క్షీణించిందని పేర్కొన్నారన్న వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు.
కుటుంబ సభ్యులు అంత్యక్రియలు, చివరి నివాళుల వివరాలు ప్రకటించారన్న పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆమె తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని కొన్ని సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి. ఈ వార్తలతో అభిమానుల్లో ఆందోళన నెలకొనగా, అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!