

యాంగ్రీ హీరో డా. రాజశేఖర్‌ను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ఆయన కమ్‌బ్యాక్ మూవీ “బైకర్”లో చేసిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు జె.వి. బత్తుల ప్రసాద్‌రావు, సెక్రటరీ సురేష్ కొండేటి తదితరులు బొకే అందజేసి సన్మానించారు. అనంతరం ట్రెజరర్ భరద్వాజ సన్మాన పత్రాన్ని చదివి వినిపించి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు రాజశేఖర్ నటనను ప్రశంసిస్తూ, అంకుశం, తలంబ్రాలు వంటి చిత్రాల్లో ఆయన చూపిన ప్రతిభను గుర్తు చేసుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆయన అదే ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ, మీడియాతో తమకు ఎప్పుడూ మంచి అనుబంధం ఉందని, రాజశేఖర్‌కు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ తనకు నచ్చిన పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.
రాజశేఖర్ మాట్లాడుతూ “బైకర్” సినిమా విడుదలైన తర్వాత తన పాత్రకు మంచి స్పందన వచ్చిందని, ప్రేక్షకులు ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి లభించిన ఈ గౌరవాన్ని అత్యంత విలువైన అవార్డుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. గతంలో అంకుశం ముందు జరిగిన ప్రమాదం తర్వాత ఆ సినిమా పెద్ద హిట్ అయినట్లు, ఇటీవల మరో ప్రమాదం తర్వాత వచ్చిన “బైకర్” కూడా విజయాన్ని అందుకుందని గుర్తుచేశారు. ఇకపై కూడా మంచి కంటెంట్ ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని తన అభిలాషను వ్యక్తం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!