4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్‌పై కేసు చట్టబద్ధతపై హైకోర్టు ప్రశ్నలు

Writer: Vamshi 05:58 AM, 17 ఏప్రిల్, 2026
పవన్‌పై కేసు చట్టబద్ధతపై హైకోర్టు ప్రశ్నలు

వైసీపీ హయాంలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల కేసులో పవన్ కళ్యాణ్పై గుంటూరు కోర్టులో దాఖలైన క్రిమినల్ ఫిర్యాదుపై హైకోర్టు ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆయన ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ కాదని గుర్తుచేస్తూ, ఏ అధికారం మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు దాఖలు చేశారో ప్రశ్నించింది. ప్రభుత్వం ఇచ్చిన జీఓ కూడా చట్టపరంగా సరైన ఆధారాలు లేకుండా జారీ చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా, పిటిషనర్ల ప్రతివాదనల కోసం విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

2023 జూలై 9న జరిగిన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా వైసీపీ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ఐపీసీ 499, 500 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అయితే తర్వాత కొందరు వాలంటీర్లు తమ ప్రతిష్ఠ దెబ్బతినలేదని, తమ సంతకాలు ఒత్తిడితో తీసుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు ఉపసంహరణకు పీపీ కోర్టును ఆశ్రయించగా, గుంటూరు కోర్టు అనుమతిచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు కోర్టుకు ఈ కేసుపై అధికారం లేదని, ఇది విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు పరిధిలోకి వస్తుందని వాదించారు. అయితే అడ్వొకేట్ జనరల్, పిటిషనర్లు మరియు ఫిర్యాదు దారులు వేర్వేరు వ్యక్తులని, మూడో వ్యక్తులకు రివిజన్ పిటిషన్ వేసే హక్కు లేదని వాదిస్తూ కేసును కొట్టివేయాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్జనసేన పార్టీహైకోర్టుగుంటూరు కోర్టువైసీపీవారాహి యాత్రచట్టపరమైన కేసుఐపీసీ 499 500ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుఅడ్వొకేట్ జనరల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..
జనరల్

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
జనరల్

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!
జనరల్

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?
గాసిప్స్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా
బిజినెస్

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!