

ఐపీఎల్ 2026 పోటీలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్ స్టేడియంలో అద్భుత ప్రదర్శన చేసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 59, క్లాసెన్ 59 పరుగులతో జట్టుకు బలమైన స్కోరు అందించారు. చివరి ఓవర్లలో చెన్నై బౌలర్లు వికెట్లు తీసి పరుగులను తగ్గించారు.
లక్ష్యాన్ని చేధించడానికి దిగిన చెన్నై జట్టు ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయింది. నితీష్ రెడ్డి మంచి బౌలింగ్ చేసి శాంసన్‌ను అవుట్ చేశాడు. అయుష్ మాత్రే 30 పరుగులతో వేగంగా ఆడినా క్లాసెన్ అద్భుత క్యాచ్‌తో అతన్ని ఔట్ చేశాడు. ఇషాన్ మలింగ గైక్వాడ్‌ను అవుట్ చేయగా సర్ఫరాజ్ ఖాన్ 25 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
తర్వాత మాథ్యూ షార్ట్ 34, శివం దూబే 21 పరుగులతో జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ అనికేత్ వర్మ అద్భుత క్యాచ్‌తో షార్ట్‌ను ఔట్ చేశాడు. తర్వాత దూబేను బౌల్డ్ చేసి మ్యాచ్‌ను హైదరాబాద్ వైపు తిప్పారు. చివరి ఓవర్లో చెన్నైకి 18 పరుగులు అవసరమైనా సాధించలేకపోయింది. ఈ విజయంతో హైదరాబాద్ మూడో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను కొనసాగించింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!