

దక్షిణాఫ్రికాలో నిర్మాణ దశలో ఉన్న న్యూ అహోబిలం ఆలయం కూలిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లోని రెడ్‌క్లిఫ్ ప్రాంతంలో శుక్రవారం జరిగింది.
ఈ ప్రమాదంలో ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, నిర్మాణ ప్రాజెక్టు మేనేజర్ అయిన విక్కీ జైరాజ్ పాండే (52) మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో నిర్మాణ కార్మికులు, అలాగే కొందరు ఆలయ అధికారులు అక్కడే విధుల్లో ఉన్నట్లు సమాచారం.
శిథిలాల కింద ఇంకా ఎంత మంది చిక్కుకుని ఉన్నారనే విషయం పై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన శిలలను భారత్ నుంచి సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. నరసింహస్వామి భారీ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలనే సంకల్పంతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నామని వారు పేర్కొన్నారు.




.png&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!