

నరేంద్రమోదీ ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు “నాగరిక్ దేవోభవ” (ప్రజలే దేవుళ్లు) అనే సూత్రాన్ని పాటించాలని సూచించారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా కోటిమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన లేఖలు రాశారు. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లో ఈ లేఖలను పంపించారు. ప్రభుత్వం తన పూర్తి సామర్థ్యంతో ప్రజలకు సేవలు అందించాలని, సహానుభూతితో పాలన ఉండాలని ఆయన సూచించారు. 21వ శతాబ్దంలో మారుతున్న సాంకేతికతలు, పెరుగుతున్న ప్రజల ఆశలు ప్రభుత్వంపై మరింత బాధ్యతను మోపుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజాసేవలో ఉన్నవారు జీవితాంతం నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలని ప్రధాని అన్నారు. మిషన్ కర్మయోగి ద్వారా ఉద్యోగుల్లో నైపుణ్యాలు, సృజనాత్మకత పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ‘కర్మయోగులు’గా దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. “సాధనా సప్తాహ్” వంటి కార్యక్రమాల ద్వారా నైపుణ్యాభివృద్ధి సాధ్యమవుతుందని, వ్యక్తిగతంగా మెరుగవుతే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!