.webp&w=3840&q=75)

హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచానికి ఊరటనిచ్చేలా ఈ మార్గాన్ని పూర్తిగా తెరిచినట్లు ప్రకటించింది. చమురు నౌకల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ ఒప్పందం కొనసాగినంతవరకు హర్మూజ్ తెరిచి ఉంటుందని పేర్కొంది.
ఈ ప్రకటనతో హర్మూజ్ మార్గంలో నౌకల రాకపోకలు సాధారణంగా కొనసాగనున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు ఈ మార్గం చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఉద్రిక్తతలు తగ్గడంతో పరిస్థితి స్థిరంగా మారింది.
ఇరాన్ ప్రకటన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం చేయడంతో ఉద్రిక్తతలు తగ్గాయి. ఇరుదేశాల మధ్య చర్చలు సఫలమవడంతో పది రోజులుగా కొనసాగిన యుద్ధానికి తాత్కాలిక విరామం లభించింది. దీంతో ప్రాంతంలో తాత్కాలిక శాంతి నెలకొంది.










.webp&w=3840&q=75)

.webp&w=3840&q=75)



.jpeg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!