
సినిమాలు

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఆయనకు ప్రాణహాని ఉన్నట్లు గుర్తించడంతో భద్రతను పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు రాఘవ్ చద్దాకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ చర్యలు చేపట్టారు.
ఇటీవల పంజాబ్ ప్రభుత్వం రాఘవ్ చద్దాకు ఉన్న భద్రతను తగ్గించిన విషయం తెలిసిందే. అయితే తాజా ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!