
న్యూస్

బలోత్రా రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో రిఫైనరీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి సుమారు 20 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక చర్యలు చేపడుతున్నాయి. ఈ ఘటన రిఫైనరీ భద్రతపై అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఈ ప్రమాదం రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగాల్సిన ప్రారంభోత్సవానికి కేవలం 24 గంటల ముందే చోటుచేసుకోవడం గమనార్హం. ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న సమయంలో ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ పేలుడుకు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!