
క్రీడలు

తిరుమలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రూ.300 దర్శన టికెట్ క్యూలైన్లో నిలుచున్న ఓ మహిళా భక్తురాలిని పాము కాటేసింది. ఈ ఘటనతో క్యూలైన్లో ఉన్న భక్తుల మధ్య కలకలం రేగింది. వెంటనే స్పందించిన అధికారులు గాయపడిన మహిళను శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రస్తుతం భక్తురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలు తెలంగాణ లోని భూపాలపల్లికు చెందిన మౌనిక (27) గా గుర్తించారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లపై చర్చలు మొదలయ్యాయి.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!