

2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో జరిగిన సంచలనాత్మక అత్యాచార కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. బాధితురాలి తండ్రి మృతి కేసులో తనకు విధించిన పదేళ్ల జైలుశిక్షను నిలిపివేయాలని సెంగార్ కోరాడు. అయితే, ఆయనకు ఉపశమనం ఇవ్వడానికి సరైన కారణాలు చూపలేదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ రవీందర్ దుడేజా శిక్షను నిలిపివేయలేమని చెబుతూ పిటిషన్‌ను కొట్టివేశారు.

బాధితురాలి తండ్రి మృతి కేసులో ట్రయల్ కోర్టు 2020 మార్చి 13 న సెంగార్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా విధించింది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిపై ఎలాంటి సానుభూతి చూపలేమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో సెంగార్ సోదరుడు అతుల్ సింగ్ సెంగార్తో పాటు మరో ఐదుగురికి కూడా పదేళ్ల జైలు శిక్ష పడింది. పోలీసుల వేధింపుల వల్ల బాధితురాలి తండ్రి తీవ్రంగా నలిగి, 2018 ఏప్రిల్ 9న మృతి చెందాడు. అత్యాచార కేసులో సెంగార్‌కు 2019 డిసెంబర్లో జీవితఖైదు శిక్ష విధించబడింది. ఈ శిక్షలపై అతను దాఖలు చేసిన అప్పీల్స్ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అప్పీల్ పెండింగ్‌లో ఉందని గత ఏడాది డిసెంబర్ 23 న హైకోర్టు శిక్షను నిలిపివేసినా, ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు గత ఏడాది డిసెంబర్ 29 న రద్దు చేసింది.
ఈ ఘటన 2017లో జరిగింది. అప్పట్లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అప్పటి బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తేలాడు. 2018లో కేసును సీబీఐకి అప్పగించారు. విచారణ అనంతరం కేసు ఢిల్లీ కోర్టుకు బదిలీ అయ్యింది. చివరికి 2019 డిసెంబర్లో కోర్టు సెంగార్‌ను దోషిగా నిర్ధారించి జీవితఖైదు విధించింది.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!