

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయపడడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి రోహిత్ మంచి ఆరంభం ఇవ్వాలని ప్రయత్నించినా, ఆరవ ఓవర్‌లో వికెట్ల మధ్య పరుగులు తీసేటప్పుడు ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి రోహిత్ కుడి హ్యామ్‌స్ట్రింగ్‌కు బ్యాండేజ్ వేశాడు.
అయినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో అదే ఓవర్‌లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. ప్రస్తుతం అతడి గాయంపై స్కాన్ రిపోర్ట్స్ కోసం ముంబై మేనేజ్‌మెంట్ ఎదురుచూస్తోంది. ఇది గ్రేడ్-1 గాయం అయితే కోలుకోవడానికి నాలుగు వారాలు పట్టే అవకాశం ఉంది. దీంతో ఐపీఎల్ సీజన్‌లో కీలక మ్యాచ్‌లకు రోహిత్ దూరమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!