

పోలవరం ప్రాజెక్టులో కేంద్ర మట్టి మరియు పదార్థాల పరిశోధనా సంస్థ బృందం రెండో రోజు పరీక్షలను నిర్వహించింది. బృంద సభ్యులు లలిత్ కుమార్ సోలంకి, హనుమాన్ ప్రసాద్ మీనా ప్రాజెక్టులో రాతి నిర్మాణాలు మరియు నిర్మాణంలో ఉపయోగిస్తున్న కాంక్రీట్‌ను పరిశీలించారు. జి హిల్ ప్రాంతంలో జరుగుతున్న గ్రౌటింగ్ పనులను తనిఖీ చేసి అక్కడ వినియోగిస్తున్న కాంక్రీట్ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
డయాఫ్రామ్ గోడ నిర్మాణంలో ఉపయోగించిన కాంక్రీట్‌పై కూడా వారు పరీక్షలు నిర్వహించారు. దిమ్మల రూపంలో భద్రపరచిన నమూనాలను అధిక పీడనంతో నీటిని ప్రయోగించి నీటి ఆమ్లీకరణ శాతాన్ని పరీక్షించారు. ప్లాస్టిక్ కవర్లు మరియు షీట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించగా కాంక్రీట్ నాణ్యత ఉన్నతంగా ఉన్నట్లు తేలింది. అదనంగా జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ప్రయోగశాలలో కూడా నాణ్యతా పరీక్షలు నిర్వహించి అధికారులు శాస్త్రవేత్తలకు వివరాలు అందించారు.

















.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!