

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తన టీవీకే పార్టీ మ్యాని ఫెస్టోను విడుదల చేశారు. ఈ మ్యాని ఫెస్టోలో మహిళలు, రైతులకు ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు నెలకు రూ.2500 చొప్పున అందజేస్తామని తెలిపారు. అలాగే పేద అమ్మాయిల వివాహాల కోసం ఎనిమిది గ్రాముల బంగారం, పట్టుచీరను అందిస్తామని ప్రకటించారు.
ఇక రైతుల కోసం కూడా కీలక హామీలు ఇచ్చారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని, ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల రుణాలలో 50 శాతం మాఫీ చేస్తామని చెప్పారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని తెలిపారు. విద్యార్థుల డ్రాపవుట్ సమస్యను తగ్గించేందుకు తల్లులకు సంవత్సరానికి రూ.15 వేల ఆర్థిక సహాయం, ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు.

















.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!