.png&w=3840&q=75)

ప్రసిద్ధ టైమ్ పత్రిక ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ప్రభావశీలులైన 100 మంది జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన తెలుగు మూలాల హృద్రోగ నిపుణుడు డాక్టర్ కిరణ్ ముసునూరుకు స్థానం లభించింది. అలాగే సుందర్ పిచాయ్, వికాస్ ఖన్నా, రణ్‌బీర్ కపూర్, యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్, పోప్ లియో, మార్కో రూబియో, మార్క్ కార్నీ, షి జిన్‌పింగ్ వంటి ప్రపంచ నేతల పేర్లు కూడా ఉన్నాయి.
డాక్టర్ కిరణ్ ముసునూరు హృద్రోగ వైద్యంలో జన్యు ఎడిటింగ్‌ను ఉపయోగించే విధానంలో ముందడుగు వేశారు. 1976లో ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన డాక్టర్ కోటేశ్వరరావు ముసునూరు కుమారుడిగా జన్మించిన ఆయన వైద్య రంగంలో తండ్రి బాటలోనే ప్రయాణించారు. లిపిడ్ జీవక్రియ, హృద్రోగ నివారణ, జన్యు ఆధారిత చికిత్సలపై విస్తృత పరిశోధనలు చేశారు. హృదయ సంబంధ వ్యాధుల చికిత్సలో జన్యు ఎడిటింగ్‌ను ప్రవేశపెట్టి, హార్ట్ అటాక్ నివారణకు టీకా అభివృద్ధి చేసే అవకాశాన్ని పరిశోధించారు.










.png&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!