
.jpg&w=3840&q=75)
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం కొంత మెరుగైనట్లు కనిపిస్తున్నప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇటీవల ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో ఆందోళన నెలకొంది. ఈ కష్టకాలంలో అతని చిన్నప్పటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్ మరోసారి అండగా నిలిచాడు. ఇప్పటికే పలుమార్లు ఆర్థిక సాయం చేసిన సచిన్ ఈసారి సహాయ బృందంలో భాగమై కాంబ్లీకి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు.
గత ఏడాది మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ కారణంగా కాంబ్లీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి క్రమంగా కోలుకుంటున్నప్పటికీ వైద్యులు కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలపై హెచ్చరించారు. మెదడులో రక్తం గడ్డ కట్టడం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని, సమయానికి చికిత్స అందకపోతే స్ట్రోక్ ముప్పు ఉందని తెలిపారు. ఇటీవలి రోజుల్లో ఆయన నడవగలుగుతున్నప్పటికీ జ్ఞాపకశక్తి సమస్యలు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి.

















.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!