
క్రీడలు

నభా నటేష్ తన అందమైన స్టిల్స్‌తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంటోంది. నాలుగేళ్ల క్రితం భుజానికి గాయం అయినప్పటికీ, ఆ మచ్చలను దాచకుండా ధైర్యంగా తన కొత్త ఫోటోల్లో చూపించడం ప్రత్యేకంగా నిలిచింది. 2022లో ఎడమ భుజానికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినప్పటికీ, తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంది. ఇప్పుడు మళ్లీ బిజీ హీరోయిన్గా మారి తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది.
ఈ సమ్మర్ ఆమెకు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. ఆమె నటించిన పాన్ ఇండియా చిత్రాలు స్వయంభు, నాగబంధం విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాల్లో భిన్నమైన పాత్రల్లో కనిపించనున్న నభా, నాగబంధంలో పార్వతి పాత్రలో, స్వయంభులో సుందరవల్లి అనే యువరాణిగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే, నభా నటేష్ కెరీర్ మరో స్థాయికి చేరే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!