
క్రీడలు

లోక్సభలో ప్రవేశపెట్టిన మూడు కీలక చట్ట ప్రతిపాదనలపై చర్చ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నెండు గంటల సమయం కోరింది. ఈ ప్రతిపాదనలపై లోక్సభలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు రెండు రాజ్యాంగ సవరణలు తప్పనిసరి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ అంశంపై సభలో విస్తృత చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.
ఇక మహిళా రిజర్వేషన్ల చట్ట ప్రతిపాదనతో నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను కలపడం అన్యాయమని డీఎంకే అభిప్రాయపడింది. మరోవైపు, ఎన్నికల లాభాల కోసమే ఈ ప్రతిపాదనలను తీసుకొచ్చారని కేసీ వేణుగోపాల్ విమర్శించారు. ఈ ప్రతిపాదనలపై రాజ్యసభలో ఎల్లుండి చర్చ జరగనుండగా, దానికి పది గంటల సమయాన్ని కేటాయించినట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!