
క్రీడలు

పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ప్రభ్‌సిమ్రన్ సింగ్ అజేయంగా 80 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 66 పరుగులతో అద్భుతంగా ఆడి 16.3 ఓవర్లలోనే 198/3 స్కోర్ చేసి సునాయాసంగా గెలుపొందింది. ప్రారంభంలో రెండు వికెట్లు కోల్పోయినా ఈ జంట ధాటిగా ఆడి ముంబై బౌలర్లపై ఆధిపత్యం చాటింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 195/6 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ అజేయంగా 112 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోర్ అందించాడు. నమన్ ధీర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పినా చివర్లో ముంబై రెండొందల మార్క్ దాటలేకపోయింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు ఎక్కడా తడబడకుండా ఆడి సొంత మైదానంలో ముంబైకి నిరాశ మిగిల్చారు.


















.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!