
క్రీడలు

రణ్ వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ధురంధర్ ఫ్రాంచైజీ భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో సంచలనం సృష్టించింది. ఈ రెండు భాగాల సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. ఇందులో రెండో భాగం మాత్రమే రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూ ఇంకా బలంగా కొనసాగుతోంది.
ఈ సినిమా విజయంతో హిందీ సినిమా పరిశ్రమలో కొత్త మార్పు కనిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలు సాధించగల సామర్థ్యం ఉందని మరోసారి నిరూపించింది. బాహుబలి 2 వంటి భారీ చిత్రాల రికార్డులను అధిగమించే దిశగా ఈ సినిమా దూసుకెళ్తోంది. కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం విశేషంగా చెప్పుకోవాలి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!