

ఆర్టెమిస్ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన వ్యోమగాముల బృందానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ట్రూత్ సోషల్‌లో స్పందించిన ఆయన, ఈ యాత్ర అద్భుతంగా సాగిందని, ల్యాండింగ్ పూర్తిగా విజయవంతమైందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఇంత గర్వంగా అనిపించిన సందర్భం మరొకటి లేదని తెలిపారు. త్వరలోనే ఆర్టెమిస్ బృందాన్ని వైట్ హౌస్‌లో కలుసుకుంటానని చెప్పిన ఆయన, భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి యాత్రలు జరగాలని, తదుపరి లక్ష్యం మార్స్‌పై ఉండాలని అన్నారు.
ఈ యాత్రలో పాల్గొన్న వ్యోమగాములు రీడ్ వైజ్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెర్మీ హాన్సెన్. ఓరియన్ క్యాప్సూల్ భూ వాతావరణంలోకి గంటకు సుమారు 25,000 కిలోమీటర్ల వేగంతో ప్రవేశించి, తర్వాత వేగం తగ్గిస్తూ పారాచూట్ సహాయంతో కాలిఫోర్నియా తీరంలో సురక్షితంగా దిగింది. నాసా అధికారి అమిత్ క్షత్రియ మాట్లాడుతూ ఈ మిషన్ అంచనాలను మించిందని, భవిష్యత్తులో చంద్రునిపై స్థావరం ఏర్పాటుకు ఇది బాటలు వేయవచ్చని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!