
న్యూస్

జాతీయ రహదారులపై నిర్దేశిత పరిమితికి మించిన బరువుతో వచ్చే భారీ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం అదనపు లోడ్‌తో వచ్చే లారీలు, ట్రక్కులపై ప్రత్యేక ఫీజులు వసూలు చేయనున్నారు. అయితే నిర్దేశిత పరిమితికి 10 శాతం వరకు అదనపు బరువు ఉంటే ఎలాంటి ఫీజు విధించరు.
పరిమితికి 10 శాతానికి మించి బరువు ఉంటే సాధారణ టోల్ ఫీజు కంటే రెట్టింపు, 40 శాతం కంటే ఎక్కువ ఉంటే నాలుగు రెట్లు ఫీజు వసూలు చేయనున్నారు. ఈ వసూళ్లు ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థల ద్వారా జరగనున్నాయి. కొత్త నిబంధనలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. మూడు యాక్సిల్ ట్రక్ 28.5 టన్నుల వరకు అనుమతించబడగా, 31.35 టన్నుల వరకు ఎలాంటి జరిమానా ఉండదు.
.jpeg&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!