
న్యూస్

వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. విశాఖలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి లోనై విలపించారు. వైఎస్సార్‌తో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, ఆయన మరణంపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు.
ముఖ్యంగా కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బొత్స, వెంటనే వాటిని వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ మరణ సమయంలో జగన్ విదేశాల్లో ఉన్నారన్న వ్యాఖ్యలు పూర్తిగా తప్పని, ఆ సమయంలో ఆయన తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం మావిగన్ అంశంపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!