
గాసిప్స్

దావోస్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. CII నిర్వహించే బ్రేక్‌ఫాస్ట్ సెషన్లో ఆయన “ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్” అంశంపై ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తారు.
అనంతరం ఇండియా లాంజ్ ప్రారంభ కార్యక్రమంలో ఇన్వెస్టర్లతో సమావేశమవుతారు. తర్వాత IBM సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో చర్చలు జరుపుతారు. సాయంత్రం JSW గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, అలాగే JSW సిమెంట్స్, పెయింట్స్ సంస్థల ఎండీ పార్థ్ జిందాల్‌తో కూడా సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!