

జనగణన-2027 తొలి దశలో భాగంగా డిజిటల్ విధానంలో స్వీయ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. దిల్లీతో పాటు 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ అమలులోకి వచ్చింది.రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా జనగణన పోర్టల్‌లో తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. ఈ పోర్టల్ లేదా యాప్ 15 రోజులపాటు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి C. P. రాధాకృష్ణన్ , ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తమ గృహ వివరాలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేశారు.
నేను నా వివరాల నమోదు పూర్తి చేశాను. దేశ ప్రజలంతా కూడా ఈ ప్రక్రియలో పాల్గొని తమ గృహ వివరాలను నమోదు చేయాలి’ అని ప్రధాని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈసారి జనగణనలో తొలిసారిగా స్వీయ నమోదు విధానాన్ని ప్రవేశపెట్టడం విశేషం. దీని ద్వారా ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.












.avif&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!