

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ చిత్రం నుంచి ‘రామ’ గ్లింప్స్ హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయింది. రణబీర్ కపూర్ రాముడిగా కనిపించిన ఈ గ్లింప్స్ ముందుగా లాస్ ఏంజిల్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించగా, తరువాత యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. విడుదలైన వెంటనే ఈ వీడియోకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. రణబీర్ లుక్, విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ చిత్రంలో సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవీ దుబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. దాదాపు 2 నిమిషాల 38 సెకన్ల ఈ గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏ ఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం ఈ చిత్రానికి మరింత హైలైట్‌గా నిలిచింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండవ భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!