

దర్శకుడు మారుతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ప్రభాస్తో చేసిన ది రాజా సాబ్ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో, ఇప్పుడు అఖిల్ అక్కినేనితో కొత్త సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న మారుతి, ఇప్పటికే అఖిల్‌కు కథను పలుమార్లు వినిపించినట్లు తెలుస్తోంది. గతంలో నాగ చైతన్యకు శైలజారెడ్డి అల్లుడుతో హిట్ ఇచ్చిన మారుతి, ఇప్పుడు అఖిల్‌కు కూడా మంచి విజయం అందించాలని చూస్తున్నారు.
ఈ వార్తపై అఖిల్ అభిమానుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కెరీర్‌లో కీలక దశలో ఉన్న అఖిల్‌కు ఇది రిస్క్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మారుతి కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ స్టైల్ అఖిల్‌కు సెట్ అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ప్రభాస్ సినిమా తర్వాత మారుతి తన కెరీర్‌ను తిరిగి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అఖిల్ లెనిన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే ఇండస్ట్రీలో భారీ ఆసక్తి నెలకొనడం ఖాయం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!