

శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘బైకర్’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుండగా, తాజాగా మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మోటోక్రాస్ రేసింగ్ మూవీలో డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటించగా, మాళవికా నాయర్ హీరోయిన్గా కనిపించనున్నారు. ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా మేకింగ్ వీడియోలో రేసింగ్ సీన్లు థ్రిల్ కలిగించేలా చూపించారు.
బైక్ రేసర్ పాత్ర కోసం శర్వానంద్ భారీగా కష్టపడ్డారు. దాదాపు 23 కేజీలు తగ్గి, కొన్ని నెలల పాటు ప్రత్యేకంగా రేసింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్లను ఒరిజినల్ ఫీల్ కోసం ప్రొఫెషనల్ రేసర్లతోనే చిత్రీకరించారు. ఇండోనేసియాలో చిత్రీకరించిన ఈ రేసింగ్ సీన్ల కోసం రెండు నెలలకుపైగా సమయం కేటాయించారు. 90ల కాలానికి చెందిన రెండు స్ట్రోక్ బైకులను ప్రత్యేకంగా డిజైన్ చేయించడం విశేషం.
ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీలో తండ్రీకొడుకుల భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఉంది. రాజశేఖర్ హీరో తండ్రి పాత్రలో నటిస్తూ, దేశంలో రేసింగ్‌కు సరైన గుర్తింపు రాలేదనే అంశాన్ని కథలో చూపిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్లో సౌండ్ డిజైన్ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జోడించి ఎడిటింగ్ చేయడం ప్రత్యేకత. డాల్బీ, ఎపిక్, 4డీఎక్స్, పీసీఎక్స్ ఫార్మాట్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!