
గూగుల్ రూపొందించిన పిక్సెల్ 10 స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త. భారతదేశంలో రూ.79,999 ధర కలిగిన ఈ ఫోన్ ప్రస్తుతం విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో రూ.74,999కి లభిస్తోంది. అదనంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ మరియు నాన్ ఈఎంఐ లావాదేవీలపై రూ.5,000 వరకు తగ్గింపు పొందవచ్చు. వన్ కార్డ్ ఈఎంఐపై రూ.2,000 డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.
ఫీచర్ల విషయానికి వస్తే, పిక్సెల్ 10 లో 6.3 అంగుళాల OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ ఉన్నాయి. టెన్సర్ G5 ప్రాసెసర్‌తో పాటు 12GB RAM, 256GB స్టోరేజ్ లభిస్తాయి. 4,970mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. కెమెరాలో 48MP ప్రైమరీ, 13MP అల్ట్రావైడ్, 10.8MP టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ సెటప్, ముందుభాగంలో 10.5MP సెల్ఫీ కెమెరా ఉంది.







.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!