

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వరుస హిట్లు కొడుతున్నారు. ఇప్పుడు రాకాస సినిమాతో సందడి చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇక తన పింక్ ఎలిఫంట్ పిక్చర్స్ బ్యానర్‌లో రాబోయే చిత్రం బరి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా తన బ్యానర్ నుండి వచ్చే అత్యధిక బడ్జెట్ చిత్రం అని ఆమె పేర్కొన్నారు. తన అన్న వరుణ్ తేజ్ హీరోగా యుదు వంశీ దర్శకత్వంలో పూర్తి స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా బడ్జెట్ వివరాల గురించి నిహారిక ఏమన్నారో చూద్దాం.
నిహారిక కొణిదెల నిర్మిస్తున్న రాకాస చిత్రం రేపు విడుదల కానుండగా, మరో ముఖ్య ప్రాజెక్ట్ బరి గురించి ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ చిత్రానికి రూ.60 కోట్ల బడ్జెట్ కేటాయించారు. తన బ్యానర్ నుండి వచ్చే హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదేనని ఆమె తెలిపింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వరుణ్ తేజ్ హీరోగా యుదు వంశీ డైరెక్షన్‌లో పూర్తి స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా అఫీషియల్‌గా స్టార్ట్ అయింది. పాన్ ఇండియా స్థాయిలో నెక్స్ట్ లెవెల్ టార్గెట్‌తో నిహారిక ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!